Clock Of Nellore ( Kovur ) – జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా బర్డ్ ఫ్లూ నివారణ చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు ఆధ్వర్యంలో పశు వైద్యాధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో గుమ్మల్లదిబ్బ, దామరమడుగు, చాటగొట్ల గ్రామాలలో రాపిడ్ బృందాలతో పర్యటించి బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు చేపట్టారు. చాటగొట్ల సమీపంలోని కోళ్ళ ఫారం షెడ్ ను పంచాయితీ అధికారులు మూసి వేయించారు. అలాగే పలు గ్రామాలలో చికెన్ దుకాణాలను మూసివేయించి, గ్రామాలలో పరిశుబ్రత చర్యలు చేపట్టారు . కోళ్ళ వ్యాధులను వ్యాప్తి చెందకుండా 344 కోళ్లను చంపి వేసినట్టు, కోడి గుడ్లను పగలగొట్టినట్లు జెడి తెలిపారు. అలాగే 3 రోజుల పాటు చికెన్ దుకాణాలను తెరవకూడదని, ప్రజలు కూడ అప్రమత్తంగా ఉంటూ కోడి మాంసం వినియోగించరాదని తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సిఈఓ కన్నమ నాయుడు ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం పంచాయితీ పరిధిలో పలు గ్రామాలలో పర్యటించి చికెన్ దుకాణాలను తెరవకుండా చర్యలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా పంచాయితీ అధికారి సుస్మిత ఆధ్వర్యంలో పొదలకూరు మండలం లోని 24 పంచాయితిలలో బ్లీచింగ్ చల్లడం , పరిసరాలను శుబ్రం చేయడం వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలలోకి కోళ్ళను తరలించకుండా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు డీపీఓ తెలిపారు.
