Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి, యువతకు భవిష్యత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు హైందవి, వైష్ఠవి పిలుపునిచ్చారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తమ తండ్రిని మూడో సారి గెలిపించాలంటూ వీరు గత నెల రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం నెల్లూరు 19వ డివిజన్ పరిధిలోని ముత్యాలపాళెం, రామిరెడ్డి కాలువ కట్ట, అరవింద్ నగర్ ప్రాంతాల్లో హైందవి, వైష్ఠవి పర్యటించారు. స్థానిక కార్పొరేటర్, టిడిపి నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. కర పత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో మా నాన్నను గెలిపంచాలంటూ అభ్యర్ధించారు. తండ్రి కోసం కుమార్తెలు రావడంతో ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానిస్తూ తప్పకుండా కోటంరెడ్డికి ఓటు వేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం హైందవి, వైష్ఠవి మాట్లాడారు. ప్రస్తుత పరిపాలన ఎలా ఉందో ప్రతీ ఒక్కరికీ తెలుస్తుందని అన్నారు. ఈ ఐదేళ్ల వైసిపీ పాలనలో రాష్ట్రం అస్థవ్యస్థం అయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించుకుని విజనరీ లీడర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అలాగే అధికారులో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా పక్షాన నిలిచే తమ తండ్రి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని విన్నవించారు.
