Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో బీటెక్ విద్యార్ధిని కిడ్నాప్ బుధవారం ఉదయం కలకలం రేపింది. నగరంలోని పొదలకూరురోడ్డు శివాజీనగర్ కు బిటెక్ చదివే ఓ విద్యార్ధినిని ఉదయం ఓ వ్యక్తి కారులో బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. యువతి కుటుంబసభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన విజయకుమార్ అనే యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఈ నేపద్యంలో కిడ్నాపా ?, పరారీనా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.