చంద్రబాబుకు ప్రతిబంధకాలన్నీ తొలగిపోవాలి : యాగం నిర్వహించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజుకొక పద్దతిలో నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వ కుట్ర కోణాన్ని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగాలని, రాజకీయ కుట్రలు చెరిగిపోవాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బంధ విమోచన యాగాన్ని నిర్వహించారు. వేదపండితల సమక్షంలో ఈ యాగం శాస్త్రోక్తంగా సాగింది. టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. యాగం అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత నెలకొన్న పరిస్థితులు, రాజకీయ కుట్రల నేపద్యంలో ఆయనకు ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ తొలగిపోయాలని, నారా లోకేష్ కు కుట్రలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని బంధ విమోచన యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో, ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్న పోరాటాలు, పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ని కోరుకున్నట్లు కోటంరెడ్డి తెలియజేశారు. త్వరలోనే చంద్రబాబుకు మంచి రోజులొస్తాయని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.

Read Previous

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు : కస్టడీకి అనుమతించిన ఏసిబి కోర్టు

Read Next

చంద్రయాన్ సిగ్నల్స్ కోసం ఇస్రో ప్రయత్నాలు

Leave a Reply

Your email address will not be published.