Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా పోలీస్ శాఖకు రూ.26 లక్షల విలువచేసే మూడు బొలెరో వాహనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అందజేసారు. సోమవారం నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇండియా (GEF) లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద అందజేసిన 3 బొలెరో వాహనాలను పోలీసు విభాగానికి ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తో కలిసి అందచేశారు. జెండా ఊపి వాహనాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నదని మంత్రి తెలిపారు. గతంలో స్వతహాగా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు, కోవిడ్ సమయంలో ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసరాలు పంపిణీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ కు కోటి రూపాయలు చెక్కును, అంతర్గత రహదారుల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు అందజేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పోలీస్ విభాగానికి రూ.26 లక్షల ఖరీదు చేసే 3 బొలెరో వాహనాలు అందజేశారని, మరో మూడు బొలెరో వాహనాలు ఇవ్వడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. కోరిన వెంటనే సహకారం ఇస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న GEF సంస్థకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ, స్థానికంగా అవసరం ఉన చోట దృష్టి సారించి CSR నిధులతో కొన్ని పనులు చేపడుతున్నామన్నారు. GEF సంస్థ నియోజక వర్గ అభివృధి లో భాగస్వాములవుతున్నందుకు సంతోషం గా వుందన్నారు. రాబోయే కాలంలో CSR క్రింద అన్ని ప్రభుత్వ విభాగాలకు సహకారం అందించాలని కోరారు. జిల్లాలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తున్నదని, జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. చిన్న పొరపాటు జరిగిన ఉన్నత స్థాయి నుండి క్రింది స్థాయి వరకు సమీక్ష చేసుకుంటూ, విశ్లేషిస్తూ , విచారణ జరిపి, తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని సంకేతం పంపుతూ బాగా పని చేస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా మరింత సమర్థ వంతంగా పనిచేయడానికి పోలీసుశాఖ లోని అన్ని విభాగాలకు అండగా నిలవాల్సిన అవసరం వుందని అభిప్రాయ పడ్డారు. విధులలో మానసికంగా వత్తిడికి గురి అవతున్న పోలీస్ విభాగానికి సహకారం అందించాల్సిన అవసరం వుందన్నారు. ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంతో మెరుగైన పోలీస్ సేవలు అందిస్తామన్నారు. మంత్రి చొరవతో GEF సంస్థ CSR నిధులతో 3 బొలెరో వాహనాలు అందించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖకు మంత్రి సహకారం ఇంకా అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ( A R) శ్రీనివాసరావు, GEF సంస్థ HR మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం, కమర్షియల్ మేనేజర్ G. పంపాపతి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
