టిడిపిలో చేరిన బిజేపి జిల్లా కార్యదర్శి మధు : ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – భారతీయ జనతాపార్టీ నెల్లూరుజిల్లా కార్యదర్శి, దళిత మోర్చా నాయకుడు కాయల మధు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు 19వ డివిజన్ ముత్యాలపాళెంకు చెందిన కాయల మధు సుమారు 300 మంది స్థానికులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా, పార్టీ కండువా వేసి మధును టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న వారికి తగు ప్రాధాన్యం ఇస్తామని, టిడిపిలో చేరేందుకు పలు పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కార్యకర్తలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. 19వ డివిజన్ లో టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా పార్టీలో చేరిన మధు పేర్కొన్నారు.

 

Read Previous

ఈనెల 15 వరకూ నెల్లూరు నుండే సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు

Read Next

చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.