Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ టిడిపి ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రూరల్ టిడిపి ఇంఛార్జ్ గా నియమితులైన నేపద్యంలో నారాయణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నెల్లూరులోని నారాయణ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయన్ను శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛం అందజేశారు. తనను రూరల్ ఇంఛార్జ్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు సిటీతో పాటూ నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేస్తామని కోటంరెడ్డి సోదరులు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలంతా కలిసి సమిష్ఠి కృషితో పనిచేసి 10 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధులు విజయం సాధించేలా కృషి చేస్తామని నారాయణకు వెల్లడించారు.