పార్కు స్థలం కబ్జా ఆరోపణలు : ఊరుకునేది లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 28వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ రోడ్డులో ఉన్న చైతన్యపురి కాలనీ పార్కు స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు పార్కు స్థలం వద్దకు వచ్చి స్థలం తమదంటూ బెదిరింపులకు దిగారని స్థానికులు అంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి పార్కును పరిశీలించి పార్కును ఎవ్వరు కబ్జా చేసినా ఊరుకోబోనని హెచ్చరించారు. తాను వైసీపిలో ఉన్నప్పుడు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి పార్కు అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయించానని, ప్రస్తుతం తాను అధికార పార్టీకి దూరంగా ఉన్న నేపద్యంలో కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పార్కు స్థలంపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. పార్కు స్థలాన్ని కబ్జా కానివ్వబోనని స్పష్టం చేశారు. మరో వైపు విషయం తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ పార్కు వద్దకు చేరుకున్నారు. పార్కుకు సంభందించిన మ్యాప్ ను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. కమిషనర్ ను బిజేపి నేత సురేష్ అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా కూర్చొని పార్కును కాపాడాలని వేడుకున్నారు. చివరకు కమిషనర్ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. దీనిపై స్పందించిన కమిషనర్ వికాస్ మర్మత్ పార్కు స్థలం ఆక్రమణపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిటీ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

 

Read Previous

గుండె జబ్బులకు కారణం హైపర్ టెన్షన్ – జాగ్రత్తలు తెలియజేసిన మెడికవర్ వైద్యులు

Read Next

31వ డివిజన్ లో మేయర్ స్రవంతి పర్యటన : అభివృద్ధి పనుల పరిశీలన

Leave a Reply

Your email address will not be published.