కావలిలో సిఎం పర్యటన ఏర్పాట్లు – పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే

Clock Of Nellore ( Kavali ) – ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేది నెల్లూరుజిల్లా కావలిలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్… కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిలతో కలసి కావలి పట్టణంలో పర్యటించి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని సందర్శించి హెలిప్యాడ్, బారీకేడింగ్ ఏర్పాట్లపై ఆర్ అండ్ బి, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం మినీ క్రీడా స్టేడియం స్థలాన్ని సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, అధికారులతో చర్చించారు. తదుపరి వాహన పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి జవహర్ భారతి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సంబంధించిన స్థలం మరియు ఆర్.టి.సి డిపో కు సంబంధించిన స్థలాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పి హిమవతి, కావలి ఆర్.డి.ఓ శీనా నాయక్, జడ్పి సి.ఈ.ఓ చిరంజీవి, ఆర్ అండ్ బి, ఎస్పిడీసిఎల్ ఎస్ఈ లు వెంకటసుబ్బయ్య, గంగాధర్, డిటిసి చందర్, డివిజనల్ అభివృద్ధి అధికారి కనక దుర్గా భవాని, కావలి మునిసిపల్ కమీషనర్ శ్రీనివాసులు రెడ్డి, కావలి తహసిల్దార్ మాధవరెడ్డి, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Read Previous

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ పోరుబాటకు కార్యాచరణ : ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సమావేశం

Read Next

12వ డివిజన్ లో మేయర్ స్రవంతి పర్యటన : పారిశుధ్య పనుల పరిశీలన

Leave a Reply

Your email address will not be published.