Clock Of Nellore ( Nellore ) – అస్థవ్యస్థంగా మారిన ఆంధ్రప్రదేశ్ తిరిగి గాడిలోకి రావాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత నావూరు శైలేంద్ర బాబు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శైలేంద్ర బాబు నెల్లూరు 34 వ డివిజన్ లో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటూ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, ఇంకా బలోపేతం చేసేందుకు అందరం కలిసి ముందుకు వెళదామంటూ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతీ ఒక్కరూ విశ్రమించకుండా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, తాటి వెంకటేశ్వర రావు, మెట్టు క్రాంతి కుమార్, తోట సునీల్, చంద్ర, శశిధర్, చిన్న మస్తాన్, హజరత్ నాయుడు, బత్తల కృష్ణ, బండి రమేష్, వెంకట రమణయ్య, మామిడి శివ, అక్భర్, అరుణమ్మ పాల్గొన్నారు.
