బస్తీమే సవాల్ అంటున్న మేకపాటి – ఉదయగిరి సెంటర్ లో తిష్ఠ

Clock Of Nellore ( Udayagiri ) – వైసీపి నుండి సస్పెన్షన్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్తీమే సవాల్ అంటున్నారు. గురువారం సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని అక్కడే కూర్చొని ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. గత రెండు రోజులుగా వైసీపి జడ్పీటిసి సభ్యుడు చేజర్ల సుబ్బారెడ్డి… మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వివిధ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం ఉదయగిరిలో మేకపాటి దిష్ఠిబొమ్మను దహనం చేసి మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామని హెచ్చరించాడు. దీనిపై స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదే ఉదయగిరి బస్టాండ్ లో గురువారం సాయంత్రం కుర్చీ వేసుకుని ఎవరొస్తారా రండి చూద్ధాం అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాసేపటి తర్వాత మేకపాటి అక్కడి నుండి తన నివాసానికి చేరుకున్నారు. మేకపాటి కుటుంబం ఏంటో ఉదయగిరి ప్రజలకు తెలుసునని అన్నారు. 

Read Previous

కొత్తూరులో గుడిసెల కూల్చివేత – దళిత సంఘాల నేతల అరెస్ట్

Read Next

నెల్లూరులో దంపతుల ఆత్మహత్య – కారణాలపై పోలీసుల ఆరా

Leave a Reply

Your email address will not be published.