Clock Of Nellore ( Kuppam ) – సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తారకరత్నకు పల్స్ పడిపోవడంతో హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని కేసి ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు సిపిఆర్ చేశారు. తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్త నాళాల్లో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. తదుపరి చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పుకొచ్చారు. మరో వైపు విషయం తెలిసిన వెంటనే కుప్పంలోనే ఉన్న నందమూరి భాలకృష్ణ హుటాహుటినా ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.