- ప్రారంభమైన అపోలో లివర్ క్లినిక్
- దేశంలో సంవత్సరానికి పది లక్షల మంది లివర్ వ్యాధిగ్రస్తులు
- లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 శాతం మంది మృత్యు ఒడికి
- అపోలో లివర్ క్లినిక్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం
Clock Of Nellore ( Nellore ) – లివర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త… లివర్ వ్యాధులతో బాధపడే వారికి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ ప్రత్యేకంగా లివర్ క్లినిక్ ను ప్రారంభించింది. నిపుణులైన వైద్యులు, నిరంతరం రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే సిబ్బందితో అపోలో లివర్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ఎలెన్ కుమారన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శరీరంలో లివర్ ఎంతో ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని తెలిపారు. మద్యం సేవించని వారిలో కూడా లివర్ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అటువంటి వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. మద్యం సేవించే వారిలో లివర్ హెపటైటిస్ ఆరోగ్యంపై త్రీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. భారతదేశంలో లివర్ వ్యాధులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయని తెలిపారు. అనంతరం అపోలో హాస్పిటల్స్ సీఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో లివర్ క్లినిక్ లో ఎంతో నిష్ణాతులైన వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రత్యేక శ్రద్ధతో లివర్ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. నెల్లూరు అపోలో హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ డాక్టర్ ఎలెన్ కుమారన్ 15 ఏళ్ల అనుభవంలో 1500 లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ లను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. నెల్లూరు అపోలో లివర్ క్లినిక్ లివర్ వ్యాధిగ్రస్తులకు వరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి సిఈఓ నవీన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మరియు అపోలో ఆస్పత్రి గాస్త్రోంతరాలజిస్ట్ డా. హిమబిందు, ఆసుపత్రి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.