Clock Of Nellore ( Muthukur ) – ప్రియుడిపై మోజుతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ భార్య కిరాతక చర్యకు ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి తర్వాత అతని శవాన్ని గోనె సంచి మూట కట్టి, కాలువలో పడేసింది. తరువాత ఏమీ ఎరుగని వ్యక్తిలా వ్యవహరించింది. నాలుగు రోజుల తర్వాత ఆదివారం ఈ విషయం బయటపడటంతో భార్య కిరాతకం బయటపడింది. ఈ ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. ముత్తుకూరు మండలం, పంటపాళెంలో మణి, శోభా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్న వీరికి నలుగురు పిల్లలు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో భార్య శోభ ప్రవర్తన విషాదాన్ని నింపింది. స్థానికంగా రొయ్యల గుంత వద్ద కాపలాదారులుగా ఉంటున్న వీరి జీవితంలోకి భరత్ అనే వ్యక్తి ప్రవేశించాడు. శోభ, భరత్ మధ్య అక్రమ సంభంధం ఏర్పడింది. ప్రియుడు భరత్ పై మోజు పెంచుకున్న శోభ.. భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేశఆరు. శవాన్ని గోతాములో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉన్న నక్కల కాలువలో పడేశారు. ఆదివారం ఆ మూట నక్కల కాలువలో తేలియాడుతూ కనింపించింది. లోపల శవం ఉన్నట్లు అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి విప్పగా మణి మృతదేహం ఉంది. పోలీసులు ప్రాధమిక విచారణలో ఈ హత్య చేసిన భార్య శోభనే అని నిర్ధారణ అయింది. దీంతో శోభతో పాటూ ప్రియుడు భరత్, మిగతా ముగ్గుర్ని ముత్తుకూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
