వైసీపిలో చేరిన టిడిపి సోషల్ మీడియా బృందం : ఆహ్వానించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 41వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ సాజిత్ బాషా, అస్లాం బాషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వారు వైసిపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని కోటంరెడ్డి సోదరులు అభినందించారు. వారితో పాటూ వారి స్నేహితులు కూడా పార్టీలో చేరారు. వైసీపిలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజాప్రయోజన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, మిద్దే మురళీ కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

మీ ఇంటి బిడ్డలా అండగా ఉంటా : దీవించాలని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

సాగునీటి సలహా బోర్డు సమావేశం : 84.6 TMC ల నీటి విడుదలకు మంత్రి కాకాణి ఆదేశం

Leave a Reply

Your email address will not be published.