నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మండపాలవీధిలోని పలు బంగారు ఆభరణాల షాపులపై సోమవారం రాత్రి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ నుండి వచ్చిన అధికారులు… స్థానిక పోలీసుల సాయంతో పలు షాపుల్లో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. దాదాపు 15 షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఐటి దాడుల విషయం తెలుసుకున్న మిగతా షాపుల వారు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. బంగారు విక్రయాలకు సంభందించిన పన్నులు సరిగా చెల్లించడం లేదని, విక్రయాల విషయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని గుర్తించిన ఐటి అధికారులు.. సోమవారం రాత్రి వ్యాపారులు ఊహించని విధంగా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు ఐటి అధికారులు తెలియజేస్తే గానీ తెలపలేం.

Read Previous

ఈనెల 27న నెల్లూరుకు సిఎం జగన్ రాక : జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం

Read Next

వైసీపినా కొడకల్లారా… చెప్పుతో కొడతా… ఊగిపోయిన పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published.