షాదీ మంజిల్ లో డైనింగ్ హాల్ : ప్రారంభించిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 9వ డివిజన్ నజీర్ తో ఉన్న షాదీ మంజిల్ లో నూతనంగా 25 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ ను మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. అలాగే 30 లక్షలతో ఈద్గాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు కూడా అనీల్ శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న అన్నీ ఈద్గాలను పూర్తి స్థాయిలో అభవృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, 9వ డివిజన్ వైసీపి ఇంఛార్జ్ వంగాల శ్రీనివాసులు రెడ్డి, కార్పొరేటర్లు కిన్నెర ప్రేమ్ కుమార్, మొగళ్లపల్లి కామాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

15.20 కోట్లతో గణేష్ నిమజ్జన ఘాట్ అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

మెడికవర్ లో 1499 / – కే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Leave a Reply

Your email address will not be published.