15.20 కోట్లతో గణేష్ నిమజ్జన ఘాట్ అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు చెరువులో 15 కోట్ల 20 లక్షల రూపాయలతో గణేష్ నిమజ్జన ఘాట్ అభివృద్ధి చేయనున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం అధికారులు, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన ఘాట్ ను పరిశీలించారు. ఘాట్ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి రావడం తన అదృష్ఠంగా భావిస్తున్నానని అన్నారు. ఆథ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఘాట్ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపి నేతలు మిద్దె మురళీ కృష్ణాయాదవ్, వెంకటేశ్వర్లు ఆచారి, మధుసూదన్ రావు, సునీల్ రెడ్డి, కృష్ణ, శివ శేషాద్రి, సతీష్, పల్లాల ప్రసాద్, చిరంజీవి, వెంకన్న పాల్గొన్నారు.

Read Previous

సిఎం సహకారంతో ముస్లిం సంక్షేమానికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

షాదీ మంజిల్ లో డైనింగ్ హాల్ : ప్రారంభించిన మాజీ మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published.