Clock Of Nellore ( Nellore ) – నారా కుటుంబంగా మారిపోయిన తెలుగుదేశం పార్టీని కనీసం ఆ పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న మనవళ్లు అయినా ఆ పార్టీని తీసుకోవాలని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సూచించారు. నందమూరి వంశం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలన్నారు. ఎన్టీఆర్ కుమారులు బావ చంద్రబాబుకు దాసోహంగా మారిపోయారని, కనీసం మనవళ్లయినా మామకు దాసోహం కాకుండా నారా వారి పార్టీగా మారిపోయిన టిడిపిని నందమూరి వారి పార్టీగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. మహనీయులు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రానా కాదన్నారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నందమూరి మనవళ్ల బుద్ది మారాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.