Clock Of Nellore ( Nellore Rural ) – ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే అవసరమైన ప్రతీ చోటా విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. నెల్లూరు రూరల్ మండలం, 1వ డివిజన్ పరిధిలోని కోడూరుపాడులో 2.1 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ కు కోటంరెడ్డి బుధవారం శంఖుస్థాపన చేశారు. మూడు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. సబ్ స్టేషన్ పూర్తయితే లో ఓల్టేజీ సమస్యలు తీసుతాయని, నిరంతరాయ విద్యుత్ సరఫరా కూడా సాధ్యపడుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
