రీ సర్వేలో అనధికార స్థలాలను గుర్తించండి – సిబ్బందికి కమిషనర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకంలో భాగంగా నెల్లూరు నగర వ్యాప్తంగా జరగనున్న రీ సర్వేలో అనధికార స్థలాలు గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ( IAS D. Haritha ) ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రీ సర్వే 4వ రోజు శిక్షణ తరగతులకు కమిషనర్ గురువారం హాజరై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్నరీ సర్వే ప్రక్రియతో నగరంలోని అనధికార లే అవుట్లు, భవనాలను గుర్తించి కార్పొరేషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పధకం యజమానుల వివరాలను సంబంధిత అధికారులకు నివేదించడంతో పాటు అనుమతులు మంజూరు కాని లే అవుట్ల యజమానులకు అవసరమైన పత్రాలను సమర్పించి, దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోపు ఎల్.ఆర్.ఎస్ పధకంలో అన్ని పాటర్న్స్, అప్లికేషన్ లను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. అదే విధంగా రోడ్డు మార్జిన్ ఆక్రమణలు, ప్రకటనలు, అక్రమ నిర్మాణాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

ఈనెల 26 నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాలు – పోస్టర్ ఆవిష్కరించిన కోటంరెడ్డి

Read Next

30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రజల ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.