రక్షణ కల్పించండి : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రేమ జంట

Clock Of Nellore ( Kavali ) – ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందంటూ తమకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట కావలి పోలీసులను ఆశ్రయించింది. గుడ్లూరుకు చెందిన బెనర్జీ, ఉలవపాడుకు చెందిన కీర్తి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని కీర్తి తన కుటుంబసభ్యులతో ప్రేమ విషయాన్ని చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమ జంట ఇంటి నుండి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం కావలి డిఎస్పీ శ్రీధర్ ను కలిసి విషయాన్ని వెల్లడించారు. తన కుటుంబం నుండి తమకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కీర్తి డిఎస్పీని కోరారు. దీంతో వారికి డిఎస్పీ భరోసా కల్పించారు. ఇరు కుటుంబాల నుండి ఏ చిన్న ఇబ్బంది కలిగిన తనకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ వారికి సూచించారు.

Read Previous

వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించండి : అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

Read Next

పద్దతి మార్చుకోండి : వైద్య సిబ్బందిని హెచ్చరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Leave a Reply

Your email address will not be published.