Clock Of Nellore ( Nellore ) – అమరావతి పేరుతో స్కాములకు పాల్పడి నెల్లూరులో పెద్ద మనిషి ముసుగులో తిరుగుతున్న వ్యక్తి కూడా త్వరలో అరెస్ట్ అవుతారని, స్కాముకు సంభందించిన అన్నీ ఆధారాలు ప్రభుత్వం సేకరించిందని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఉద్దేశించి ఆయన ఈ వ్యాక్యలు చేశారు. గురువారం నెల్లూరులోని సింహపురి కాలనీలో అనీల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి స్కాములో నారాయణ కూడా త్వరలో అరెస్టు అవుతారని అన్నారు. స్కిల్ స్కాములో పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు కోర్టులు బెయిల్ నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై సొంత టిడిపి నేతలే మౌనంగా ఉంటే తమ పార్టీ నుండి జంప్ అయిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హడావుడి ఎక్కువైందని ఎద్దేవా చేశారు.