Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరుతో కొందరు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. నకిలీ ఫేస్ బుక్ ద్వారా పలువురికి మెసేజులు పెడుతూ డబ్బులు కావాలంటూ అడుగుతున్నారు. అంతే కాకుండా మహిళలకు అసభ్యకరంగా మెసేజులు పెడుతున్నారని కూడా తెలిసింది. కొందరు మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9701449978 ఫోన్ నంబర్ ద్వారా నకిలీ అకౌంట్ ను సృష్ఠించిన కొందరు… తన మిత్రుల ఫేస్ బుక్ అకౌంట్లకు డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా 74168 94156 అనే నంబర్ ద్వారా తన పేరుతో కొందకు నకిలీ అకౌంట్లను సృష్ఠించారని గిరిధర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపై విచారణ జరిపి నకిలీ అకౌంట్లు సృష్ఠించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Reporter – P. Eswar