Clock Of Nellore ( Tadepalli ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ దేశాల కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ తెలుగు సొసైటీ ( APNRTS ) డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్ జన్మదిన వేడుకలు గురువారం తాడేపల్లిలో ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని కార్యాలయంలో APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్, అధికారులు, సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా ఇలియాజ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మైన్ వెంకట్ తో పాటూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఇలియాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ఇలియాజ్ ధన్యవాదాలు తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల భద్రత, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని వెల్లడించారు. అలాగే 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపి విజయం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్, సిఈఓ స్వర్ణలత, యుఏఈ APNRTS కో – ఆర్డినేటర్ షేక్ నాజర్, ఎన్.ఆర్.ఐ శ్రీనివాసులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Source…
Shaik Gouse Basha
Print & Electronic Media Co-ordinator
YSRCP Gulf Wide