Clock Of Nellore ( Kuwait ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ కువైట్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళుతున్న సందర్భంగా కువైట్ లోని మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్ లో వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో కువైట్ కమిటీ సభ్యులు, మరియు వైఎస్సార్ అభిమానులకు భారీ విందు ఏర్పాటు చేసి, బి హెచ్ ఇలియాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి మాట్లాడుతూ 2024 లో మరోసారి వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులకు ఉందని తెలుపుతూ… ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టి అమలుపరుస్తున్న సంక్షేమ పధకాల మూలంగా రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అని చెప్పిన చంద్రబాబు అదే నోటితో ఇప్పుడు ఉచిత వాగ్దానాలు చేయడం దారుణమని, గతంలో చంద్రబాబు సుమారు 6 వందల ఉచిత వాగ్దానాలు చేశారని, అధికారంలోకి రాగానే మాట మార్చి ఆ వాగ్దానాలను అమలు చేయకుండా మేనిఫెస్టో ను ఆన్ లైన్ వెబ్ సైట్ నుండి తీసేసినారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్లు చంద్రబాబు మాట మార్చడంలో దిట్ట అని, ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గు పడుతుందని చంద్రబాబు చేసే మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు.
వైసీపి కువైట్ కమిటీ కో కన్వీనర్లు గోవింద్ నాగరాజు, ఎం .వి. నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కొరకు పార్టీ స్ధాపించిన వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి కన్నా ఒక అడుగు ముందుకేసి బడుగు, బలహీన వర్గాలకు మైనారిటీ , బిసి కులాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, 2024 ఎన్నికల సమయంలో కువైట్ నుండి బాలిరెడ్డి ఆధ్వర్యములో సుమారు 2 వందల మంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గ్లోబల్ కన్వీనర్ మేడపాటి, ఇలియాస్ కలిసి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు లాజరస్, గౌరవ సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నాజీ రాజశేఖర్,మైనారిటీ నాయకులు షేక్. రహమతుల్లా తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమములో వైసీపి కువైట్ కమిటీ బి సి విభాగం ఇన్చార్జ్ రమణ యాదవ్, యువజన విభాగం ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, ఎస్టీ ఎస్సీ, విభాగం ఇన్చార్జ్ బి ఎన్ సింహా, సాంసృతిక విభాగం ఇన్చార్జ్ కె. వాసుదేవ రెడ్డి, గల్ఫ్ మీడియా కోఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా, కువైట్ మీడియా వైస్ ఇంచార్జ్ పి. సురేష్ రెడ్డి, పిడుగు సుబ్బా రెడ్డి, అబుతురాబ్, షేక్ సబ్దర్ హుసేన్, హరి ప్రసాద్ చౌదరి, షా హుసేన్, షేక్ బాషా, లక్మీ ప్రసాద్, మరియు పార్టీ సభ్యులు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులు భారీగా పాల్గొన్నారు.
