కువైట్ లో ఘనంగా రాజంపేట మున్సిపల్ ఛైర్మైన్ పోలా జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Kuwait ) – వైసీపి నేత, రాజంపేట మున్సిపల్ ఛైర్మైన్ పోలా శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్ లో ఘనంగా జరిగాయి. పోలా సైన్యం రాజంపేట టీం ( కువైట్ ) వారి ఆధ్వర్యంలో కువైట్ హవల్లీ గవర్నరేటు ప్రాంతంలోని ఆర్ ఆర్ రెస్టారెంట్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా అభిమానులు కేక్ కట్ చేసి పోలా శ్రీనివాసులు రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట మున్సిపల్ ఛైర్మైన్ గా ఆ ప్రాంత అభివృద్ధికి పాటు పడటంతో పాటూ కాకతీయ విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి విద్యను అందిస్తున్నారని అన్నారు. పోలా శ్రీనివాసులు రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాంక్షించారు.

 

Read Previous

రాజకీయ సునామీలో వైసీపి కొట్టుకుపోవడం ఖాయం : ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Read Next

మహిళల అభ్యున్నతకే చేయూత పథకం – చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.