Clock Of Nellore ( Amaravathi ) – సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వద్ద ప్లకార్జు చేత బూని బడ్జెట్ సమావేశాలకు వెళ్లిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అంతరాత్మ ప్రభోధం మేరకే ఓటు వేస్తానని, మిగిలిన సభ్యులకు కూడా ఇదే చెబుతున్నానని అన్నారు.