Clock Of Nellore ( Nellore ) – ప్రతి పక్షాల కుట్రలను తిప్పికొట్టి జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేయాలని మాజీ మంత్రి, రీజనల్ కో- ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నెల్లూరులోని వైసీపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం కు ముఖ్య అతిధిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని మాట్లాడుతూ ప్రతి పక్షాలు విషపు ప్రచారం చేస్తున్నాయని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించి పట్టభద్రులకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. అదేవిదంగా నాడు నేడు ద్వారా పాఠ శాల లకు మహార్థశ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డికే దక్కిందన్నారు .పట్టభద్రులకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత జగన్ దని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరం కలసికట్టుగా పనిచేసి విజయబావుట ఎగురావేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, ఎమ్.పి ఆదాల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, మానుగుంట మహిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్సీ అభ్యర్ధులు మేరుగ మురళీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.