
Clock Of Nellore ( Hydarabad ) – తీవ్ర గుండెపోటుకు గురై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారక రత్న శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్ధీవ దేహాన్ని ఆదివారం తెల్లవారు జామున స్వస్థలమైన హైదరాబాద్ కు తరలించారు. వారి నివాసంలో సందర్శనార్ధం ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తో సహా నందమూరి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని తారక రత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంతో సహా రాజకీయ, సినీ ప్రముఖులు కూడా భౌతిక కాయాన్ని దర్శించి కన్నీరు పెట్టుకున్నారు. వైసీపి ఎంపి విజయసాయి రెడ్డి కూడా తారకరత్న భౌతిక కాాయన్ని దర్శించి నివాళి అర్పించారు. మరో వైపు తారకరత్న అంత్యక్రియల విషయమై బాబాయ్ నందమూరి భాలకృష్ణతో కుటుంబసభ్యులు చర్చించారు. భాలకృష్ణ సూచనల మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రజల సందర్శనార్ధం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నట్లు తెలియజేశారు.