Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సినిమా రంగంలో ఉండి ఉంటే ఎస్వీ రంగారావును మించి మహా నడుడు అయి ఉండే వారని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు. లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆయన దిట్ట అన్నారు. జగన్ కు నమ్మ ద్రోహం చేస్తే నా పిల్లలు నాశనమైపోతారని తాను మీడియా ముందు వెల్లడిస్తే… శ్రీధర్ రెడ్డి తన పిల్లలను అన్నట్లుగా చెప్పుకుని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనీల్ శుక్రవారం సాయంత్రం భగత్ సింగ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. తాను చెప్పిన సవాలుపై స్పందించకుండా నేను నా పిల్లలపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడమేంటని ప్రశ్నించారు. తన సవాలుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.