ఖతర్ లో ఏపి మహిళ ప్రమాదవశాత్తూ మృత్యువాత : మృతదేహాన్ని స్వస్థలం చేర్చిన APNRTS

Clock Of Nellore ( Qatar ) – జీవనోపాధి కోసం ఖతర్ వెళ్లి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మృతదేహాన్ని క్షేమంగా వారి స్వస్థలానికి పంపారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( APNRTS ) సభ్యులు. వివరాల్లోకి వెళితే ఏపిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం, గుడిమూల గ్రామానికి చెందిన హేమలత అనే మహిళ జీవనోపాధి నిమిత్తం గత కొంత కాలంగా ఖతర్ దేశంలో ఉంటూ అక్కడే జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బాత్ రూంలో పడి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడింది. మృతిరాలి బంధువులు ఖతర్ లోని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( APNRTS ) సభ్యులకు తెలియజేశారు. హేమలత మృతదేహాన్ని స్వస్థలానికి పంపేలా సాయం చేయాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖతర్ కన్వీనర్ దొండపాటి శశి కిరణ్, APNRTS సభ్యులు, స్థానిక టీసిఎఫ్ చర్చ్ నిర్వాహకుల సాయంతో హేమలత మృతదేహాన్ని స్వస్థలమైన ఏపి పంపించారు. చర్చ్ పాస్టర్ బిషప్ ఓగూరి బుల్లెబ్బాయి ఖతర్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్, ఇతర పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించారు. విమానం ద్వారా ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ కు పంపగా అక్కడి నుండి స్వస్థలం చేర్చేందుకు APNRTS సభ్యులు ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఇవాళ స్వస్థలం చేర్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని వైసీపి ఖతర్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్, చర్చ్ సభ్యులు మరియు వైసీపి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నల్లి నాగేశ్వర రావు, గడ్డం సుదర్శన రావు దగ్గరుండి తరలించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువువు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమకు సాయం చేసిన APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్, సిఈఓ దినేష్ కుమార్, డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read Previous

TV9 రవి ప్రకాష్ ఆధ్వర్యంలో కొత్త న్యూస్ ఛానల్ : త్వరలో ప్రసారాలు ప్రారంభం

Read Next

నిరుపేద రోగులకు అండగా… డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్…

Leave a Reply

Your email address will not be published.