Clock Of Nellore ( Nellore ) – సోమశిల జలాశయం నుండి పెన్నానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో పెరగడంతో మరిన్ని గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపద్యంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్… కార్పొరేషన్ కమిషనర్ హరితతో కలిసి నగరంలోని పెన్నా పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. పెన్నాలో వరద పెరిగితే ముంపుకు గురయ్యే వెంకటేశ్వర పురం, భగత్ సింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్.ఈ, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ, కార్పొరేషన్ ఎస్.ఈ, డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖాధికారి, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags: Nellore city Constency Nellore city MLA Anil kumar Yadav nellore penna barrige Nellore Penna River Penna Flood Areas