Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 21 రోజుల భవానీ దీక్షను పూర్తి చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన 21 రోజుల క్రితం నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షను చేపట్టారు. అప్పటి నుండి ఆయన ఆలయంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారంతో 21 రోజులు పూర్తి కావడంతో ఇరుముడి కట్టించుకుని అమ్మవారి ఎదుట దీక్షను విరమించారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. రేపు కూడా కోటంరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
