Clock Of Nellore ( Sangam ) – ఈనెల 30వ తేదీనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నెల్లూరుజిల్లాలోని సంగం బ్యారేజీ పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 30వ తేదీ లోగా మొత్తం పనులను పూర్తి చేసే విధంగా 24 గంటలూ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 27వ తేదీ కల్లా మొత్తం పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 27వ తేదీనా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బ్యారేజీ పరిశీలనకు రానున్నారని చెప్పారు. అనంతరం సిఎం రాక నేపద్యంలో సంగంలోని గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలిప్యాడ్, బహిరంగ సభ నిమిత్తం పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ తో పాటూ జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ కరుణ కుమారి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
