
Clock Of Nellore ( Nellore ) – అనుమానంతో భర్త తన మర్మాంగంపై యాసిడ్ తో దాడి చేశాడని నెల్లూరు శివగిరి కాలనీకి చెందిన ఓ మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో అక్రమ సంభందం పెట్టుకున్న భర్త వెంకట రమణయ్య తనపై అనుమానంతో నిత్యం వేధిస్తుంటే పుట్టింటికి వచ్చానని చెప్పారు. గత ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెగదెంపులు తెంచుకుందామని తనను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేయడమే కాకుండా మర్మాంగంపై యాసిడ్ పోశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిశ పోలీసులను కోరింది.