Clock Of Nellore ( Kandukuru ) – స్నేహితుణ్ని మద్యానికి బానిస చేసి… అతని భార్యపై కన్నేసి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి ఆపై వివస్త్రగా ఉన్న ఆమెను వీడియో తీసి… అతను బెదిరించే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె విషయాన్ని భర్తకు చెప్పగా ఇద్దరూ పురుగుల మందు తాగి ఈనెల 23వ తేదీనా ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే. నెల్లూరుజిల్లా లింగ సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నెల్లూరుకు చెందిన ఇలియాజ్ ను ఇవాళ కందుకూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇదీ కేసు నేపద్యం….
నెల్లూరు రంగనాయకులపేటలో షాహూల్ – అతని భార్య నివాసం ఉంటున్నారు. 6 నెలల క్రితం షాహుల్ కు ఇలియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యి స్నేహితుడిగా మారాడు. ఈ క్రమంలో షాహుల్ భార్యపై ఇలియాజ్ కన్నేశాడు. షాహుల్ కు రోజూ మద్యం ఇప్పిస్తూ దానికి బానిసగా మార్చాడు. ఈ క్రమంలో ఓ రోజు షాహుల్ కు పూటుగా మద్యం తాగించి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతని భార్యకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న షాహుల్ భార్యపై ఇలియాజ్ అత్యాచారం చేశాడు. అంతే కాకుండా దాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. వివస్త్రగా మత్తులో నిద్రపోతున్న ఆమెను వీడియో, ఫోటోలు తీశాడు.
ఇలా రెండు మూడు దఫాలు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని లేదంటే వీడియోలు బయటపెడతానని ఆమెను బెదిరించాడు. భర్తను కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన షాహుల్ దంపతులు ఈనెల 23వ తేదీనా కావలి సమీపంలోని లింగసముద్రంలోని వారి నివాసంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తమ పరువు పోయిందని, తమ చావుకు ఇలియాజ్ కారణమని చెబుతూ పురుగుల మందు తాగారు. దీన్ని చూసిన వారి బంధువులు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అలాగే 108 కి సమాచారం అందించారు. దీంతో చుట్టుపక్కల వారు వారున్న నివాసానికి చేరుకుని వారికి సబ్బు నీళ్లు తాగించి వాంతులు చేయించి కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తర్వాత వారు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడు ఇలియాజ్ ను ఇవాళ కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు.