Clock Of Nellore ( kavali ) – నెల్లూరుజిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. 12 మంది కావలి నుండి కొండ బిట్రగుంట ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గౌరవరం వద్ద ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అందరూ గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 108 ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృత్యువాత పడ్డారు.
