పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మంజూరును సులభతరం చేయండి : వెంకట్ ఎస్. మేడపాటి

Clock Of Nellore ( Amaravathi ) – ఇండియా నుండి విదేశాలకు వెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( APNRTS ) అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. దీనిపై విజయవాడ, విశాఖపట్నంలోని రీజనల్ పాస్ పోర్టు అధికారులకు లేఖ రాశారు. విదేశాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు, విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ సమయంలో పోలీస్ సర్టిఫికేట్ తప్పనిసరి అని అన్నారు. అయితే ఆ సర్టిఫికేట్లు సకాలంలో అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వెంకట్ లేఖలో పేర్కొన్నారు. సర్టికేట్ మంజూరు కొరకే అందుబాటులో ఉండే స్లాట్లు పెంచాలని, తత్కాల్ కోటాను ప్రవేశపెట్టాలన్నారు. కోవిడ్ సమయంలో ఏపికి చెందిన వేలాది మంది వలస కార్మికులు, విద్యార్ధులు విదేశాలను స్వస్థలాలకు వచ్చేశారని గుర్తు చేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి వెళ్లాలనుకునే కార్మికులకు ఈ సర్టిఫికేట్ నమోదు ప్రక్రియ ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై దృష్ఠి సారించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Previous

కోటంరెడ్డి శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు… విపిఆర్ కితాబు

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్… సోమవారం నుండి యథాతధం

Leave a Reply

Your email address will not be published.