Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుకు చెందిన ఓ వైసీపి నాయకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఆ నేతతో పాటూ కుటుంబసభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నేత కుమారుని భార్య… ఆ కుటుంబంలోని అందరిపై తెలంగాణాలో గృహ హింస కేసు పెట్టినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం నెల్లూరు రూరల్ మండలంలోని వారి నివాసానికి తెలంగాణా పోలీసుల వెళ్లగా వారు అక్కడ లేరు. నెల్లూరులో ఉన్న ఇంకో ఇంటికి కూడా పోలీసులు వెళ్లగా అక్కడ కూడా వారు లేరని తెలిసింది. ఎలాగైనా వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు తెలంగాణా పోలీసులు నెల్లూరులో మకాం వేసినట్లు చెబుతున్నారు. మూడు రోజుల నుండి ఆ నాయకుడు, వారి కుటుంబసభ్యులు అందుబాటులో లేరు. కేసు రాజీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
Tags: Nellore YCP Leaders