మే నెలలో పెన్నా, సంగం బ్యారేజీలు ప్రారంభం : మంత్రి అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజీతో పాటూ సంగం బ్యారేజీ నిర్మాణ పనులు ఏప్రిల్ చివరి కల్లా పూర్తి చేసి మే నెలలో రెండింటినీ ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన నెల్లూరులో పెన్నా బ్యారేజీని అధికారులతో కలిసి పరిశీలించారు. బ్యారేజీ పనులు ఎంత వరకూ పూర్తయ్యాయి, ఇంకా మిగిలిన ఉన్న పనుల గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మే నెల కల్లా పనులు పూర్తవుతాయని అదే నెలలో పెన్నా బ్యారేజీతో పాటూ సంగం బ్యారేజీని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ సుజాత, బీసి కార్పొరేషన్ ఛైర్మైన్ నారాయణ ముదిరాజ్, నెల్లూరు కార్పొరేషన్ కో- ఆప్షన్ సభ్యులు నూనె మల్లిఖార్జున యాదవ్, స్థానిక వైసీపి నేత కందుకూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి – రెవెన్యూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం

Read Next

బాలాయపల్లి అభివృద్ధికి కృషి – సర్వసభ్య సమావేశంలో ఆనం వెల్లడి

Leave a Reply

Your email address will not be published.