అక్రమ కేసులకు భయపడవద్దు… బాలాజీకి భరోసా ఇచ్చిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – టిడిపి నేతలు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు నమోదు చేస్తుందని, ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరూ భయపడవద్దని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నెల్లూరు బాలాజీనగర్ కు చెందిన కువ్వారపు బాలాజీని కలిసి భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, నగర నియోజకవర్గ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి బాలాజీ నివాసానికి వెళ్లిన సోమిరెడ్డి.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Read Previous

వేగంతో కూడిన సేవలు అందించండి… సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Read Next

నెల్లూరులో వికటించిన లింగ మార్పిడి ఆపరేషన్ – వ్యక్తి మృతి

Leave a Reply

Your email address will not be published.