Clock Of Nellore ( Nellore ) – శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా పేరులోని ” నెల్లూరు ” అనే పదాన్ని తొలగించాలని కోరుతూ అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఉపాధ్యక్షులు కెవి చలమయ్య నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. నెల్లూరు అనే పదాన్ని తొలగించి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన విషయాన్ని చలమయ్య కలెక్టర్ కు గుర్తు చేశారు. పేరు మార్పు అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటూ మంత్రులకు లేఖలు రాసినట్లు తెలియజేశారు. మార్చి 16 పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పాలని కోరారు.