నెల్లూరుజిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా : ప్రయాణీకులకు గాయాలు
Clock Of Nellore ( Kovur ) - భువనేశ్వర్ నుండి బెంగుళూరు వెళ్తున్న నవీన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. నెల్లూరుజిల్లాలోని కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.