చంద్రబాబు మాటలు నమ్మవద్దు : ప్రచారంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఏనాడూ నెరవేర్చలేదని, ఆయన మాటలు విని మోసపోవద్దని నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతమున్న 3వేల రూపాయల పెన్షన్ ను, 4వేలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. గురువారం ఆదాల ప్రభాకర్ రెడ్డి దొంతాలి గ్రామంలో పర్యటించారు. డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డి, నేతలతో కలిసి దొంతాలికి వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి 5లక్షలతో నిర్మించిన నాంచారమ్మ చెరువు అలుగును, మరో 5లక్షలతో నిర్మించిన మట్టికట్టను ప్రారంభించారు. అలాగే కాలువలను కూడా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో ఆదాల మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపిని మరో సారి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వైసీపిని గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయని అన్నారు. చంద్రబాబు మాటలు విని టిడిపికి ఓటు వేయవద్దని హెచ్చరించారు. త్వరలోనే 3వేల పెన్షన్ ను, సిఎం జగన్ 4వేలు చేయనున్నారని ప్రకటించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డిని ఎంపిగా గెలిపించాలని ఆదాల కోరారు.

Read Previous

కోవూరు బరిలో ప్రశాంతిరెడ్డి… ఆనంకు ఆత్మకూరు.. సర్వేపల్లి పెండింగ్…

Read Next

నెల్లూరు రూరల్ లో టిడిపిలోకి భారీగా చేరికలు : కోటంరెడ్డికి సంపూర్ణ మద్దతు

Leave a Reply

Your email address will not be published.