చంద్రబాబును సిఎం చేసుకోవడం చారిత్రాత్మక అవసరం : కోటంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు ఆపార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ ను కట్ చేసి మెగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి, నేతలు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కిలారి వెంకట స్వామి నాయుడు, ధర్మవరపు సుబ్బారావు, కప్పిర శ్రీనివాసులు, నావూరు శైలేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేతలతో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కేక్ ను కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని ఆనం వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ రక్తదాన శిభిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 405 మంది రక్తదానం చేసినట్లు వైద్యులు తెలియజేశారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే తాను ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం చారిత్రాత్మక అవసరమని గిరిధర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాకతో నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతమైందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని నేతలు కొనియాడారు.

Read Previous

బిసీల అభ్యున్నతిపై మాట్లాడే హక్కు వైసీపికి మాత్రమే ఉంది : టిడిపి నేతలపై అనీల్ ఆగ్రహం

Read Next

ఎమ్మెల్యే అనీల్ ను కలిసిన నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మట్

Leave a Reply

Your email address will not be published.