
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ డిఎస్పీ పి. వీరాంజనేయరెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయన్ను డిఎస్పీ విధుల నుండి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల నుండి రిలీవ్ అయ్యి నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఐజి ఆదేశించారు. ఎన్నికలకు ముందు 16 నెలల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ గా గత ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమితులైనారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంఛార్జ్ గా వచ్చిన కొద్ది రోజుల్లోనే రూరల్ డిఎస్పీగా వీరాంజనేయరెడ్డి నియమితులైనారు. తర్వాత ఎన్నికలు జరగడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపద్యంలో సోమవారం వీరాంజనేయరెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డిఎస్పీ వచ్చే వరకూ నెల్లూరు సిటీ డిఎస్పీ రూరల్ కు ఇంఛార్జ్ గా కొనసాగనున్నారు.