దళితుల అభ్యన్నతికి సిఎం జగన్ శక్తి వంచన లేని కృషి : వెల్లడించిన ఎస్సీ కమిషన్ సభ్యులు

Clock Of Nellore ( Kavali ) – దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నవరత్నాల కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్.సి కమీషన్ సభ్యులు కె. బసవ రావు అన్నారు. మంగళవారం నెల్లూరుజిల్లా కావలి పట్టణంలోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్.సి. కమీషన్ సభ్యులు బసవ రావు మాట్లాడారు. కొండాపురం మండలం, మర్రిగుంట గ్రామంలో ఎస్.సి కులానికి చెందిన ఇండ్ల చిన అంకయ్య కు సంబంధించిన భూ సమస్య పై రావడం జరిగిందని అన్నారు. దళితుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు బసవ రావు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్నదన్నారు. దళితులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచు కోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్.సి ల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నదని, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హోం శాఖ మంత్రిగా దళిత మహిళను నియమించడం జరిగిందన్నారు. దళితులకు చెందాల్సిన పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని కమీషన్ సభ్యులు అన్నారు.

Read Previous

జెన్ కో ను అధానీకి అప్పగిస్తే ఊరుకోం : ప్రభుత్వాన్ని హెచ్చరించిన సోమిరెడ్డి

Read Next

నెల్లూరు కోర్టులో చోరీ కేసు : సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

Leave a Reply

Your email address will not be published.