Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా తుమ్మలపెంట రోడ్డులో ఆముదాల దిన్నె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ఇద్దరు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొల్లదిన్నె గ్రామానికి చెందిన జంపని నారాయణ మృత్యువాత పడగా మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని కావరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.