స్ట్రోక్ పై అవగాహనలో అపోలో హాస్పిటల్ ముందంజ : డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్

  • ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం
  • స్ట్రోక్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించిన న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధుమీనన్
  • వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ( WSO ) పరిశోధన కమిటి కో – ఛైర్మైన్ గా, బోర్డు సభ్యురాలిగా నియమితులైన డాక్టర్ బింధు మీనన్
  • లింగ సమానత్వం మరియు స్ట్రోక్ కేర్ కమిటి ( GENESIS ) కోర్ సభ్యురాలిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ బింధుమీనన్
  • స్ట్రోక్ పై అవగాహన కల్పించడంలో అపోలో హాస్పిటల్స్ ముందంజలో ఉందన్న డాక్టర్ శ్రీరామ్ సతీష్
  • స్ట్రోక్ నివారణకు అపోలో హాస్పిటల్స్ అనుసరిస్తున్న విధి విధానాలను వివరించిన వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – ప్రజలు స్ట్రోక్ కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ సూచించారు. స్ట్రోక్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ముందస్తు గుర్తింపు, వేగవంతంగా వైద్య సేవలు అందించడం, రోగికి మంచి ఆరోగ్యాన్ని అందించడం అనే ప్రక్రియలో అపోలో హాస్పిటల్ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధుమీనన్, న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్, డాక్టర్ రష్మి రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ స్ట్రోక్ లో ప్రధానమైనది బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ తో సంభవించే పక్షవాతానికి సంబంధించి ప్రతీ నిముషం ఎంతో విలువైందని, ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు అంత వేగంగా పక్షవాతం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. డాక్టర్ బింధుమీనన్ అపోలో హాస్పిటల్ లో సేవలు అందిస్తూనే నిరుపేదల కోసం డాక్టర్ బింధుమీనన్ ఫౌండేషన్ ను స్థాపించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ( WSO ) పరిశోధన కమిటి కో – ఛైర్మైన్ గా, బోర్డు సభ్యురాలిగా డాక్టర్ బింధు మీనన్ నియమితులవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అంతే కాకుండా లింగ సమానత్వం మరియు స్ట్రోక్ కేర్ కమిటి ( GENESIS )కి డాక్టర్ బింధుమీనన్ కోర్ సభ్యురాలిగా కూడా నియమితులయ్యారని, ఆమె నియామకం ప్రపంచ స్ట్రోక్ పరిశోధనలో భారతదేశం పోషిస్తున్న ప్రముఖమైన పాత్రను హైలెట్ చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

తర్వాత డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్ సంయుక్తంగా మాట్లాడుతూ అపోలో స్పెషాలిటి హాస్పిటల్ స్ట్రోక్ పై ప్రజల్లో అవగాహన, నివారణకు ప్రణాళికా బద్దంగా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రాధమిక దశలో ముందుగా స్ట్రోక్ ను గుర్తించడం, వేగంగా వైద్య సేవలు అందించడంపై దృష్ఠి సారిస్తున్నట్లు చెప్పారు. రెండో దశలో స్ట్రోక్ పై ప్రజలకు వివిధ మార్గాల ద్వారా అవగాహన పెంచుతామన్నారు. ఆ తర్వాత నుండి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, అత్యవసర పరిస్థితి కోసం అపోలో హాస్పిటల్స్ లో 24×7 వైద్య సేవలు అందించేందుకు స్ట్రోక్ – రెడీ వైద్య బృందం అందుబాటులో ఉంటుందని డాక్టర్ బింధుమీనన్, డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. తీవ్రమైన స్ట్రోక్ కు గురైన వారికి థ్రోంబోలిసిస్, థ్రోంబెక్టమీ వైద్య సేవలను క్రమం తప్పకుండా నిర్వహించి రోగిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు అంతర్జాతీయ స్థాయి AHA/ASA కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ గుర్తింపు లభించడం హాస్పిటల్ లో అందించే వైద్య సేవలను గుర్తింపు అని సంతోషం వ్యక్తం చేశారు.

Read Previous

నెల్లూరు రూరల్ లో ” చంద్రన్న విద్యుత్ వెలుగులు ”… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Read Next

ముందస్తు జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యుల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.